తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాజ్‌భవన్ ఘోరావ్ నేపథ్యంను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఏఐసీసీ పిలుపుతో కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ శివార్లలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు. లుంబినీ పార్కు నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ పలువురు నేతలను పోలీసులు అడ్డుకొని... అరెస్ట్ చేశారు.
సెక్రటేరియట్ వద్దకు రాగానే.. పోలీసులు... నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు, ఓబీసీ సెల్ ఛైర్మన్ కత్తి వెంకట స్వామి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్య నాయక్‌లు అరెస్టైన వారిలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఫిరోజ్ ఖాన్, యూత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ తదితరులను అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని... పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ వరకు ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని అందువల్లే నేతలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలపారు.
ఇదీ చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేసిన హైకోర్టు