ETV Bharat / city

KARVY CRIME: కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ మోసాలు.. విచారణకు సిద్ధమైన అధికారులు - karvy stoke broking latest news

కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పెట్టుబడిదారులకు తెలియకుండా వాళ్ల షేర్లను తనఖాపెట్టి బ్యాంకుల్లో వందల కోట్లు రుణంగా తీసుకున్నసంస్థ.. డబ్బులు తిరిగి చెల్లించలేదు. సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి మోసాల చిట్టాను బయటపెట్టేందుకు హైదరాబాద్ సీసీఎస్​ పోలీసులు శ్రమిస్తున్నారు. పార్థసారథి రెండు రోజుల కస్టడీలో మరిన్ని వివరాలు సేకరించాలని భావిస్తున్నారు.

కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ మోసాలు
కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ మోసాలు
author img

By

Published : Aug 25, 2021, 9:36 AM IST

కార్వీ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ ఖాతాదారులను నిలువునా ముంచిన ఛైర్మన్ పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండ్రోజులుపాటు ప్రశ్నించనున్నారు. నాంపల్లి న్యాయస్థానం అనుమతితో.. కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు.. మోసాలచిట్టాను బయటికి లాగేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇండస్‌ ఇండ్ బ్యాంక్ నుంచి రూ.137కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించని కేసులో పార్థసారథిని రిమాండ్‌కు తరలించారు. ఆ కేసులో మరింత పురోగతి సాధించేందుకు పోలీసులు వివరాలుసేకరించనున్నారు. సీసీఎస్​లో పార్థసారథిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. హెచ్​డీఎఫ్​సీ నుంచి 347కోట్లకు పైగా.. రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్‌తో పాటు కార్వీ కమాడిటీస్ లిమిటెడ్ పై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.

రూ.500కోట్లకు పైగా రుణం

సైబరాబాద్‌లోనూ పార్థసారథిపై కేసు నమోదైంది. ఐసీఐసీఐలో 500కోట్లకు పైగా రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదని గచ్చిబౌలిలో కేసు నమోదైంది. ఆ కేసును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగానికి బదిలీ చేశారు. ఏపీలోనూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ పై కేసు నమోదైంది. 2009లో తన డీమ్యాట్ ఖాతా నుంచి 5 లక్షలకు పైగా నగదు మాయమైందని శ్రీనివాస్ అనే వ్యక్తి... పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భీమవరం పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో నేరాభియోగపత్రం దాఖలు చేశారు. పార్థసారథి ఒక్కసారి న్యాయస్థానంలో హాజరు కాకపోవడంతో.. అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. హైదరాబాద్‌ నుంచి పీటీ వారెంట్‌పై పార్థసారథిని భీమవరం తీసుకెళ్లే యోచనలో పోలీసులు ఉన్నారు.

2020లోనే కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ లిమిటెడ్​పై నిషేధం

కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థలో లక్ష మందికి పైగా ఖాతాదారులున్నారు. డీమ్యాట్‌ఖాతా తెరిచిన పెట్టుబడి దారులు కోట్ల రూపాయలను స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టారు. కొన్నేళ్లుగా కార్వీ నిర్వాహకులు పెట్టుబడి దారుల ఖాతాల్లోని షేర్లను తమవిగా చూపించి బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఆ విషయం సెబీ దృష్టికి వెళ్లడంతో 2020లోనే కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ను నిషేధించడంతో... బ్యాంకుల్లో రుణం తీసుకున్నట్లు బయటపడింది. కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి, డైరెక్టర్లు గత రెండేళ్లుగా బ్యాంకులకు రుణం చెల్లించట్లేదని బ్యాంకు ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా కార్వీ బాధితులుండొచ్చని సీసీఎస్​ పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులెవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కార్వీ మోసాలకు చెందిన పూర్తి వివరాలు సేకరించే పనిలో సీసీఎస్ పోలీసులు నిమగ్నమయ్యారు. సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు పార్థసారథిని పీటీ వారెంట్ తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కార్వీ సంస్థ మోసం డైరెక్టర్ల పాత్ర ఏ మేరకు ఉందనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. సంస్థ డైరెక్టర్లనూ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:విషాదం: మేకల మేత కోసం చెట్టెక్కిన బాలుడు..పట్టుతప్పి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.