ETV Bharat / city

తెలంగాణ.. హుజూర్​నగర్​లో కొనసాగుతున్న పోలింగ్

author img

By

Published : Oct 21, 2019, 8:03 AM IST

Updated : Oct 21, 2019, 12:53 PM IST

తెలంగాణలోని హుజూర్​నగర్​లో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది.

హుజూర్​నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

తెలంగాణలోని హుజూర్​నగర్​లో ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్​ సరళిని ఎస్పీ భాస్కరన్​ పరిశీలించారు.

పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కాసేపు పోలింగ్​ నిలిచిపోయింది. పాలకవీడు మండలం బెట్టెతండాలో... వీవీప్యాట్, బ్యాలెట్ అనుసంధానంలో సమస్య తలెత్తింది. అటు నేరేడుచర్ల మండలం చింత బండ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంలో... సమస్య ఎదురైంది. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో హుజూర్​నగర్​ ఉపఎన్నిక తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్​పి క్యాంపస్​లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హుజూర్​నగర్​ నియోజకవర్గంలో 79 పోలింగ్​ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 540 మంది సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, 400 మంది టీఎస్​ఎస్పీ దళ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది సిబ్బంది పోలింగ్​ విధులు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్​ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్, యాక్ట్​ 30 అమల్లో ఉంది.

Ambala (Haryana), Oct 20 (ANI): The polling officers in Haryana left for their respective polling booths in Ambala ahead of state assembly elections on October 21. The election campaign in Haryana ended on October 19. Security arrangements have been made at all the polling stations in state. The assembly polls in Haryana will take place on October 21 and results of the same will be declared on October 24.
Last Updated : Oct 21, 2019, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.