ETV Bharat / city

భార్యకు ఉద్యోగం రాలేదని దాడి చేసిన భర్త - husband brutally tortured his wife and children news

అతనో ఆర్టీసీ ఉద్యోగి.. కానీ భార్యకు జాబ్​ రాలేదనే కోపం... ఆడపిల్లల్నే కన్నదనే ద్వేషం అతనిలో అణువణువు నిండిపోయింది. ఇదే విషయమై రోజు తాగి వచ్చి భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. సొంత బిడ్డలే అనే కనికరం లేకుండా వారిని విచక్షణారహితంగా కొడుతూ, బూతులు తిడుతూ.. వారికి నిత్యం నరకం చూపించిన ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

భార్యకు ఉద్యోగం రాలేదని దాడి చేసిన భర్త
భార్యకు ఉద్యోగం రాలేదని దాడి చేసిన భర్త
author img

By

Published : Sep 23, 2020, 11:38 PM IST

భార్యకు ఉద్యోగం రాలేదని దాడి చేసిన భర్త

తెలంగాణలోని వికారాబాద్​ ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పనిచేస్తున్న అజిమోద్దీన్​కు... నజీయా బేగంతో 2014వ సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. అజిమోద్దీన్ రోజు తాగి వచ్చి భార్యకు, పిల్లలకు నిత్యం నరకం చూపించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేని నజీయా పోలీసులను ఆశ్రయించింది.

తనకు జాబ్​ రాలేదని, ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారనే నెపంతో రోజు తిడుతూ, కొడుతూ... చంపుతానని తన భర్త బెదిరించేవాడని బాధితురాలు వాపోయింది. చిన్న పిల్లలని చూడకుండా... పిల్లలను సైతం తీవ్రంగా హించేవాడని తెలిపింది. పిల్లలపై ఉమ్మి వేస్తూ, బూతులు తిడుతూ, చితకబాదేవాడని పేర్కొంది. పిల్లలను కొడుతున్న వీడియోలను అత్తమామలకు పంపినా వారు పట్టించుకోకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనను, పిలల్లను ఆ దుర్మార్గుడి చెర నుంచి తప్పించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిమోద్దీన్​ను అరెస్టు చేశారు. నజీయాబేగం, ఇద్దరు పిల్లలను సఖీ సెంటర్​కు పంపించినట్లు సీఐ రాజశేఖర్ వెల్లడించారు.

ఇది చదవండి

దీపిక, రకుల్, శ్రద్ధలకు ఎన్​సీబీ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.