తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు బాధితుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఇప్పటికే చాలామంది చికిత్స తీసుకున్నప్పటికీ.. వింతగా ప్రవర్తిస్తున్నారు. కల్లు కావాలంటూ తలలు బాదుకుంటున్నారు. కల్లు తాగి వందల మంది ఆస్పత్రి పాలవ్వగా.. ఇద్దరు మృతి చెందారు.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామాల్లోని కల్లు డిపోల్లో నుంచి నమూనాలు సేకరించారు. రెండు దుకాణాలు సీజ్ చేశారు. ఇప్పటివరకు సేకరించిన నమూనాల ఫలితాలు రాలేదని వెల్లడించారు.
ఇదీ చదవండి:
'బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశం లేదు... కోడి మాంసం, గుడ్లు తినొచ్చు'