గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఆదివారం ఉదయం కేటగిరి-1లోని 4 రకాల పోస్టులకు జరిగిన రాత పరీక్షకు భారీ స్పందన లభించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు వెల్లువలా తరలివచ్చి పరీక్ష రాశారు. దాదాపు 11.58 లక్షల మంది తరలి రావటంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష సందడి ఏర్పడింది. 90 శాతానికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయటం రికార్డని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
లెక్కలు ఇలా ఉన్నాయి..
కేటగిరీ-1 పరీక్ష వివరాలు..
పోస్టులు-36,449
దరఖాస్తు చేసుకున్న వారు- 12,54,034 మంది
హాజరైనవారు- 11,58,538(92.50 %)
గైర్హాజరు- 23,560 మంది
కేటగిరి-3 పరిధిలోని పోస్టులకు 12,54,034 మంది దరఖాస్తు చేసుకోగా..11,58,538 మంది హాజరయ్యారు. 95,436 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
కేటగిరీ-1 పరీక్షకు జిల్లాల వారీగా హాజరు
జిల్లా | మొత్తం అభ్యర్థులు | హాజరు | శాతం |
శ్రీకాకుళం | 70,589 | 65,980 | 93.47 |
విజయనగరం | 58,812 | 55,095 | 93.68 |
విశాఖపట్నం | 1,31,722 | 1,21,821 | 92.48 |
తూర్పుగోదావరి | 1,24,795 | 1,15,698 | 92.71 |
పశ్చిమగోదావరి | 86015 | 80392 | 93.46 |
కృష్ణా | 1,14,128 | 1,01,982 | 89.36 |
గుంటూరు | 1,12,223 | 1,02,947 | 91.73 |
ప్రకాశం | 75899 | 69496 | 91.56 |
నెల్లూరు | 73797 | 68668 | 93.05 |
చిత్తూరు | 1,07,721 | 1,00,409 | 93.21 |
కడప | 8,2534 | 76927 | 93.21 |
అనంతపురం | 1,00,208 | 9,2865 | 92.67 |
కర్నూలు | 1,15,531 | 1,06,258 | 91.97 |
మొత్తం 12,53 974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా...11,58,538 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు.