ETV Bharat / city

'దిశ' దశలా.. కుటుంబ సమస్యలు సైతం - ఏపీలో దిశ యాప్ తాజా వార్తలు

'దిశ' దశలా వ్యాపించటానికి చేపట్టిన దిశ యాప్​కి అధిక సంఖ్యలో కుటుంబ సమస్యలే వస్తున్నాయి. మగువల చేతిలో మొబైల్​ని మూడు సార్లు ఊపటం ద్వారా సులువుగా తమ సమస్యలను పోలీసులకు వివరిస్తున్నారు. క్షణాల్లో స్పందిస్తున్న పోలీసులు భర్తల వేదింపుల నుంచి కాపాడుతున్నారు.

huge response for disa app for family problems like  Domestic violence, husband harassment
'దిశ' దశలా.. కుంటుబ సమస్యలు సైతం
author img

By

Published : Feb 14, 2020, 8:55 AM IST

Updated : Feb 14, 2020, 9:53 AM IST

ఆపత్కాలంలోని మహిళలను ఆదుకునేందుకు ఏపీ పోలీసు శాఖ తీసుకొచ్చిన దిశ యాప్‌కు ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం కుటుంబ సమస్యలే ఉంటున్నాయి. తన భర్త విచక్షణారహితంగా విపరీతంగా కొడుతున్నాడంటూ కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ, విశాఖపట్నం నగరానికి చెందిన మరో మహిళ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. చేతిలోని మొబైల్‌ ఫోన్‌ మూడు సార్లు ఊపటం (షేక్‌ చేయటం) ద్వారా తాము సమస్యలో ఉన్నట్లు దిశ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. పోలీసులు నిమిషాల వ్యవధిలో బాధితుల వద్దకు చేరుకుని వారి భర్తల వేధింపుల నుంచి కాపాడారు. అనంతరం అన్నిరకాల సేవలు అందించే వన్‌స్టాప్‌ సెంటర్‌కు బాధితులను పంపించారు. కుటుంబ సమస్యలపై ఫిర్యాదులు చేసేవారికి నిపుణులు, పోలీసులతో కౌన్సిలింగ్‌ ఇప్పిస్తున్నారు.

వేధింపులపై ఫిర్యాదుల అస్త్రం
* వరుసకు సోదరుడైన ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ యాప్‌లోని ఆపత్కాల మీట (ఎస్‌వోఎస్‌) నొక్కి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
* ఓ వ్యక్తి తనను తరచూ వేధిస్తున్నాడని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధిత బాలిక వద్దకు చేరుకుని ఆమెకు భరోసా కల్పించారు. వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

4రోజుల్లో 50 వేల డౌన్‌లోడ్‌లు
ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను గత నాలుగు రోజుల్లో 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. యాప్‌ పనిచేస్తోందా? లేదా? పరీక్షించేందుకు రోజుకు సగటున రోజుకు రెండు వేల మంది అందులోని ఫీచర్స్‌ను వినియోగిస్తున్నారు. ఆ సమాచారమంతా మంగళగిరిలోని రాష్ట్ర స్థాయి దిశ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతోంది. వీటిలో నిజంగా సమస్య ఉన్న కాల్స్‌ను గుర్తించి అవసరమైన చర్యలను పోలీసులు చేపడుతున్నారు.

నాలుగైదు రోజుల్లో ఐవోఎస్‌లో
దిశ యాప్‌ను నాలుగైదు రోజుల్లో యాపిల్‌ ఫోన్‌ పనిచేసే ఐవోఎస్‌ ప్లాట్‌ఫామ్‌లోకీ అందుబాటులోకి తీసుకువస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: మహిళా అధికారికి 'దిశ' అండ.. సిబ్బందికి సీఎం అభినందన

Last Updated : Feb 14, 2020, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.