ETV Bharat / city

తెలంగాణ: కొత్తగా 1921 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 1921 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,396కు చేరింది. కొత్తగా 9మంది మృతి చెందడంతో...రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 674 మందికి చేరింది.

huge-corona-
huge-corona-
author img

By

Published : Aug 14, 2020, 3:10 PM IST

తెలంగాణలో కొత్తగా 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 9 మరణాలను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 88,396కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్​తో 674 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి కోలుకుని మరో 1,210 మంది డిశ్చార్జయ్యారు.

23,438 యాక్టివ్ కేసులు...

మొత్తంగా కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 64,284 మంది డిశ్చార్జయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,438 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 356 కరోనా కేసులను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. మేడ్చల్‌ జిల్లాలో 168, రంగారెడ్డి జిల్లాలో 134 మంది వైరస్ బారిన పడ్డారు. సంగారెడ్డిలో 90, వరంగల్ అర్బన్ 74, కరీంనగర్ 73, ఖమ్మంలో 71 కేసులు, నల్గొండ 73, సిద్దిపేట 63, గద్వాల జిల్లాలో 51 మందికి కరోనా వైరస్ సోకింది. పెద్దపల్లి, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో 54 చొప్పున కేసులు నమోదయ్యాయి.

ఇవీ చూడండి :

వైరస్​ విలయం: రెండు కోట్ల 10 లక్షలకు కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.