ETV Bharat / city

కనిపించని శత్రువు.. అప్రమత్తతే బంధువు! - హైదరాబాద్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి

కరోనా.. ఈ కనిపించని శత్రువుతో నిత్యం ఎంతోమంది యుద్ధం చేస్తున్నారు. హైదరాబాద్​లో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్‌ వ్యాప్తి వివరాలు అంతుచిక్కడం లేదు. ఎవరి నుంచి సోకిందో, ఇంకా ఎవరెవరికి పాకిందో తెలుసుకునేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వైరస్‌ చైన్‌ను తెంచేందుకు యంత్రాంగం నిరంతరం కష్టపడుతున్నారు.

how-corona-spreads-in-hyderabad
భాగ్యనగరంలో కరోనా వ్యాప్తి వివరాలు అంతుచిక్కడం లేదు
author img

By

Published : May 9, 2020, 9:17 AM IST

లాక్‌డౌన్‌ను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29 వరకు మరోసారి పొడిగించగా.. కొన్ని సడలింపులు ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది నిర్మాణ రంగం. దీనికి అనుబంధ వ్యాపారాలతోపాటు ఆర్టీఏ, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, మద్యం దుకాణాలు రెండు రోజులుగా తెరుచుకున్నాయి.

ఈ పనులపై చాలామంది ఇళ్ల నుంచి బయటకు వస్తుండటం వల్ల రోడ్లపై రద్దీ అధికమైంది. మార్కెట్లలో జనం ఎక్కువగా కన్పిస్తున్నారు. ఈ పరిణామాలు వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇచ్చేలా ఉన్నాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పని ఉంటేనే.. అదీ మాస్క్‌ ధరించి మాత్రమే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు చేతులను ముఖం, ముక్కు, నోటికి తాకకుండా చూసుకోవాలి.

ఆగని వైరస్‌ వ్యాప్తి...

గ్రేటర్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి పెరుగుతోంది. శుక్రవారం మరో పది కేసులు నమోదయ్యాయి. ఇందులో సరోజనిదేవి ఆసుపత్రి క్వారంటైన్‌లో ఉన్న అయిదుగురు ఉన్నారు.

  • మూసాపేట సర్కిల్‌ అల్లాపూర్‌ డివిజన్‌ పరిధి రాజీవ్‌గాంధీనగర్‌లో ఓ వ్యక్తి(50)కి కూడా పాజిటివ్‌ వచ్చింది.
  • గూడ్స్‌షెడ్డు రోడ్డులో హమాలీ కార్మికుడైన అతని కుటుంబంలో 11 మందిని నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.
  • ముషీరాబాద్‌ డివిజన్‌ పఠాన్‌బస్తీ చేపల మార్కెట్‌ సమీపంలో ఓ వృద్ధుడు(65)కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతని కుటుంబ సభ్యులు, మరికొందరిని కలిపి 14 మందిని హోం క్వారంటైన్‌కు తరలించారు.
  • ఎస్సార్‌నగర్‌ గురుమూర్తినగర్‌లో కొబ్బరి కాయల వ్యాపారి (55)కి కరోనా నిర్ధారణ అయింది.
  • నాగోలు సాయినగర్‌లో కరోనా బారిన పడిన యువకుడి కుటుంబసభ్యులకు కరోనా లక్షణాలు లేకపోవడం వల్ల పరీక్షలకు పంపకుండా ఇంటిలోనే క్వారంటైన్‌ చేశారు. కేవలం ఆ యువకుడిని మాత్రమే గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరుండే అపార్టుమెంటును కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి మరో 40 కుటుంబాలను హోం క్వారంటైన్‌ చేశారు. యువకుడి కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించాలని అపార్ట్‌మెంట్‌వాసులు కోరగా శుక్రవారం వారిని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు.
  • నల్లకుంటలోని ఫీవరాసుపత్రిలో శుక్రవారం నలుగురు, ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో 15 మంది అనుమానిత లక్షణాలతో చేరారు.

ఎలా సోకిందో...

  • కార్వాన్‌ సబ్జిమండిలో ఓ కూరగాయల వ్యాపారి (50)కి కరోనా సోకడం వల్ల గాంధీ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం మృతి చెందాడు. ఆయనకు ఎవరి నుంచి వైరస్‌ సోకిందో తెలియని పరిస్థితి.
  • ఎస్సార్‌నగర్‌ పరిధిలో ఓ జిమ్‌ యజమాని(48)కి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల గాంధీకి తరలించారు. ఎవరి నుంచి వైరస్‌ సోకిందోనని అధికారులు ఆరా తీస్తున్నారు.
  • ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలో ఇంటి వద్దే ఉంటున్న ఓ ఆటో డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఎలాంటి ప్రయాణం చేయకపోయినా వైరస్‌ ఎలా అంటుకుందో అంతుబట్టడం లేదు.
    how-corona-spreads-in-hyderabad
    భాగ్యనగరంలో కరోనా వ్యాప్తి వివరాలు అంతుచిక్కడం లేదు

ఇదీ చదవండి :

స్టెప్పులతో అదరగొడుతున్న కరోనా బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.