ETV Bharat / city

Floods: వరద పోయింది.. బురద మిగిలింది - గోదావరి వరదలు

గోదావరి వరదతో ఇల్లు విడిచి బయటపడిన బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. నీటిలో నాని ఇంటి గోడలు బలహీనంగా తయారయ్యాయి. ఇళ్లల్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు పాత ఇనుప సామానుకు వేయాల్సిన పరిస్థితిలు తలెత్తాయి. ఇల్లు శుభ్రం చేయించుకోవాలన్నా.. కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా ఒక్కో కుటుంబంపై సగటున రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు భారం పడుతోంది.

వరద పోయింది
వరద పోయింది
author img

By

Published : Aug 1, 2022, 4:16 AM IST

గోదావరి వరదతో ఇల్లు విడిచి బయటపడిన బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. కొన్నిచోట్ల వరద ఉద్ధృతికి ఇళ్లలోని సామగ్రి కొట్టుకుపోయింది. ఇళ్లలో వస్తువులు పనికిరాకుండా పోయాయి. ఇల్లు శుభ్రం చేయించుకోవాలన్నా.. కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా ఒక్కో కుటుంబంపై సగటున రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు భారం పడుతోంది. వారం, పది రోజుల పాటు నీటిలో నానిన ఇళ్లు ఎందుకు పనికొస్తాయనే ఆవేదన బాధిత కుటుంబాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం పూర్తిగా పడిపోయిన ఇంటికే పరిహారం ఇస్తామంటోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 389 గ్రామాలు నీటమునిగాయి. ప్రతి గ్రామంలోని వందల ఇళ్లలోకి నీరు చేరింది. 5-10 రోజులు అలాగే ఉంది. సామాన్లు రోజుల తరబడి నీటిలోనే నానిపోయాయి. కొన్నిచోట్ల సామాన్లు కొట్టుకుపోయాయి.

  • టీవీ, ఫ్యాన్లు, మిక్సీ, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు నీటిలో నానిపోవడంతో పనికి రాకుండా పోయాయి. వాటిని పాత సామాన్లకు అమ్ముకున్నామని కొందరు చెప్పారు. ఇంట్లోని వైరింగ్‌ మొత్తం దెబ్బతింది. సామాన్లు కొనాలంటే ఒక్కో ఇంటికి రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతుందని బాధితులు పేర్కొంటున్నారు. వైరింగ్‌కు రూ.10వేల వరకు అవుతుందని చెబుతున్నారు.
  • పది రోజులకు పైగా నీటిలో నానడంతో.. గోడలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. మట్టి గోడలు నాని బలహీనంగా తయారయ్యాయి. ప్రస్తుతం పడిపోకపోయినా.. రాబోయే రోజుల్లో నేలకూలతాయనే ఆందోళన ముంపు గ్రామాల్లో వ్యక్తమవుతోంది.
  • పెద్ద ఎత్తున చేరిన బురదను శుభ్రం చేయించుకోవాలంటేనే ఒక్కో ఇంటికి రూ.5-20వేల వరకు అవుతున్నాయని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన పలువురు వాపోయారు.
  • ఈ నష్టాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు సరికదా.. ఇల్లు దెబ్బతిన్నట్లు రాయడం లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. పంటనష్టం వివరాలు పూర్తిగా తీయలేదు. నీటిలో కుళ్లిపోయిన మొక్కలు, కొట్టుకుపోయిన పంట వివరాలు బయటకు కనిపించడం లేదు. వీటినీ పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
.

కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలేనికి చెందిన చింతా వెంకటేశ్‌ ఇల్లు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. మంచాలు, విద్యుత్తు సామగ్రి, టీవీలు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా పాడయ్యాయి. మట్టిగోడలు నాని ఇల్లు పడిపోయింది. మళ్లీ కొత్తగా కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టడానికే రూ.లక్ష వరకు అవుతుందని వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఇతర సామాన్లకు రూ.50-70 వేల వరకు అవుతుంది. ప్రభుత్వం ఇచ్చే కొద్దిమొత్తం పరిహారం సరిపోదని ఆయన వాపోయారు.

పూరిగుడిసె పడిపోయింది.. కొత్తదానికి రూ.25వేలు: కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంక ఆఫ్‌ ఠాణేలంకకు చెందిన బుల్లి మరిడరాజు వరదలకు రెండు నెలల ముందు గుడిసె నిర్మించారు. ఇంతలో వరద రావడంతో పడిపోయింది. సామాను కూడా కొట్టుకుపోయాయి. మొత్తం నష్టం రూ.25వేలకు పైనే ఉంటుంది. ఒంటరి అయిన ఆయనకు ప్రభుత్వం రూ.వెయ్యి సాయం అందించింది. ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేక పొరుగువారింట్లో తలదాచుకుంటున్నానని వివరించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.