రాగల రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాడ్పుల పరిస్థితులు ఉంటాయని రాష్ట్రవిపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ కోస్తాంధ్ర జిల్లాల్లోని 113 మండలాల్లో , ఏప్రిల్ రెండో తేదీన 148 మండలాల్లో , మూడో తేదీ 203 మండలాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా , గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు విజయనగరం,శ్రీకాకుళం, విశాఖల్లోనూ తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశముందని విపత్తు నిర్వహణా సంస్థ హెచ్చరించింది.
ఏప్రిల్ 1 తేదీన గుంటూరులో 29 , కృష్ణాలో 27 , విజయనగరం 19, విశాఖపట్నం 10 మండలాల్లోనూ ఎక్కువ ప్రభావం ఉంటుందని ... ఏప్రిల్ 2 తేదీ 148 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 207 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని స్పష్టం చేసింది. గుంటూరులో 33 కృష్ణాలో 24 , పశ్చిమ గోదావరి లో 18, విజయనగరం 18, తూర్పు గోదావరిలో 16, విశాఖపట్నం 15, శ్రీకాకుళం 10 మండలాల్లో ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. తీవ్రమైన వడగాడ్పులు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణా సంస్థ సూచించింది. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
ఇదీ చూడండి. భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్