దిశ చట్టంపై అసెంబ్లీలో చర్చ జరిగిందని హోంమంత్రి సుచరిత అన్నారు. పార్టీలన్నీ మద్దతు తెలిపాకే దానిని కేంద్రానికి పంపామని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక చట్టం అమలులోకి వస్తుందన్న ఆమె.. ప్రత్యేక కోర్టులు వస్తే సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని చెప్పారు. చట్టం గురించి తెదేపా నేతలు పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని.. ఈ విషయంలో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు. దిశ యాప్‌ను 40 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: FARMER MINISTER JAWAHAR: 'మద్య నిషేధం చేతకాకపోతే.. నాణ్యమైన మద్యాన్ని అమ్మండి'