ETV Bharat / city

50 ఏళ్లలోపు వారికి ఇంట్లోనే చికిత్స

author img

By

Published : May 1, 2020, 9:05 AM IST

కరోనా వైరస్​ లక్షణాలు తక్కువగా ఉన్న వారు, 50 సంత్సరాల్లోపు వారి ఇళ్లలో ఉండి చికిత్స పొందేందుకు వీలుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని జారీ చేసింది.

home madication to corona victims below 50
50 ఏళ్లలోపు కరోనా బాధితులకు చికిత్స ఇళ్లలోనే

కరోనా వైరస్‌ స్వల్ప లక్షణాలున్నవారు, వ్యాధి సోకినా ఆ లక్షణాలు లేని వారు ఇక నుంచి ఇళ్లలోనే చికిత్స పొందేందుకు వీలుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని జారీ చేసింది. 50 సంవత్సరాల్లోపు వారు.. నిర్ధారించిన పరీక్షల్లో ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఇళ్లలో ఉండి చికిత్స పొందేందుకు వైద్యుల సిఫార్సుతో మినహాయింపు ఇస్తామని పేర్కొంది.

రక్తపరీక్షలు, మధుమేహం, సీరం క్రియాటిన్‌, చెస్ట్‌ ఎక్స్‌రే, ఈసీజీ, ఎసీపీఓ2 పరీక్షలు చేయాలి. వీటి నివేదికల్లో ఏమైనా తేడాలు ఉంటే ఇంట్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇవ్వరు. ఆస్పత్రుల్లోనే ఉండాలి. వీటిని అనుసరించి జిల్లా కలెక్టర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • బాధితుడి నివాసం కొవిడ్‌ ఆస్పత్రికి సమీపంలో ఉండాలి.
  • అపార్టుమెంట్లలో నివసించేవారికి ఇంట్లో చికిత్స పొందేందుకు అవకాశం ఇవ్వరు. ఉమ్మడి కుటుంబమైనా ఇదే నిబంధన వర్తిస్తుంది.
  • కరోనా లక్షణాలున్న వ్యక్తి ఇంట్లో 60 సంవత్సరాలు, అంతకు మించి వయసున్నవారు ఉండకూడదు.
  • ప్రత్యేకంగా గది, మరుగుదొడ్డి ఉండాలి.
  • రోగి ఆరోగ్య స్థితిని సంరక్షకులు రోజుకు రెండుసార్లు గమనించాలి. సపర్యలు చేసేటప్పుడు గ్లౌజులు ధరించాలి.
  • అవసరమైనప్పుడు వీడియోకాల్‌లో వైద్యులతో మాట్లాడే సౌకర్యం రోగికి ఉండాలి.
  • మానసిక గందరగోళం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారితే వ్యాధి తీవ్రత పెరిగిందని భావించాలి.
  • బాధితులు తమ వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకూడదు. వారు తాకిన ప్రదేశాలు, మందులు, వస్తువులు, తలుపులు, హ్యాండిళ్లను హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపరచాలి.
  • బాధితుల శరీర ద్రవాలు, నోటి ద్వారా వచ్చే తుంపర్లకు దూరంగా ఉండాలి.
  • వైరస్‌ నిర్ధారణ జరిగిన 14, 15 రోజుల్లో పరీక్షలు చేస్తారు. అప్పుడు నెగిటివ్‌ వస్తేనే రోగి స్వీయ నిర్బంధం ముగుస్తుంది.

ఇదీ చదవండి...పరిశ్రమలను ఆదుకోండి... ప్రధానికి సీఎం లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.