ఫిబ్రవరి పదో తేదీన సచివాలయంలో ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశం జరగనుంది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన ఈ హెచ్ఓడీల సమావేశాన్ని నిర్వహించనున్నారు. నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై సీఎస్ ఈ భేటీలో సమీక్షించనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో తొలిసారి ఈ హెచ్ఓడీల సమావేశం జరుగుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. గడచిన ఏడాదిన్నరగా రాష్ట్రంలో హెచ్ఓడీల సమావేశం జరక్కపోవటంతో ఈ భేటీ కీలకంగా మారింది.
ఇదీ చదవండి: ఈ-వాచ్ యాప్ వాడకంలోకి తేవద్దు: హైకోర్టు