మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి టెండర్లు ఖరారు చేయవద్దని.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు, విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేసింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. మిషన్ బిల్డ్ ఏపీకి సంబంధించి టెండర్లు ఖరారు చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చిన ధర్మాసనం.. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
'తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం'