ETV Bharat / city

విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్ - విజిలెన్స్ కార్యాలయాల తరలింపు న్యూస్

విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలు కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది. కార్యాలయాల తరలింపును నిలుపుదల చేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై న్యాయవాది లక్ష్మీనారాయణ 'ఈటీవీభారత్'​తో మాట్లాడారు.

High court suspended vigilance office moving to kurnool
విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్
author img

By

Published : Mar 20, 2020, 7:29 PM IST

ఈటీవీ భారత్​తో న్యాయవాది లక్ష్మీనారాయణ

విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. కార్యాలయాల తరలింపును సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతు కొండేపాటి గిరిధర్‌, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాలపై పిటిషనర్‌, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం... రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

తగినంత స్థలం లేదు: ప్రభుత్వ వాదన

పరిపాలన సౌలభ్యం కోసం కార్యాలయాలు కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. సచివాలయంలో విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాల నిర్వహణకు తగినంత స్థలం లేని కారణంగా వాటిని కర్నూలుకు తరలిస్తున్నామని ఏజీ కోర్టుకు వివరించారు. ఆ రెండు సంస్థలు స్వతంత్రమైనవని, వాటి కార్యాలయాల ఏర్పాటు అంశం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని విచారణ సందర్భంగా ఏజీ చెప్పారు. దురుద్దేశంతో కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇటీవలే వాదనలు మగిసినప్పటికీ ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

ఇదీ చదవండి : కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను నిలుపుదల చేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.