రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై మంగళగిరి మండలం కృష్ణాయపాలేనికి చెందిన ఆవల నందకిషోర్.... కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఇంద్రనీల్... సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం... ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన 107 జీవోపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: