ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావు కేసులో సుప్రీం మార్గదర్శకాలు పాటించండి : హైకోర్టు - హైకోర్టులో ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏజీ వెంకటేశ్వరరావు అరెస్ట్‌ విషయమై 'ఆర్నేశ్ కుమార్ వరెస్ స్టేట్ ఆఫ్ బిహార్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఏపీ ప్రభుత్వం, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అధికారులు మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చని గుర్తుచేసింది. తన అరెస్ట్​ను నిలువరించాలని ఏబీ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Oct 1, 2020, 4:15 AM IST

రక్షణ పరికరాల కొనుగోళ్ల అంశంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏజీ వెంకటేశ్వరరావు అరెస్ట్ విషయమై ' ఆర్నేశ్ కుమార్ వరెస్ స్టేట్ ఆఫ్ బిహార్' కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. అధికారులు మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చని గుర్తుచేసింది. తగిన కోర్టును ఆశ్రయించడానికి ఈ ఉత్తర్వులు పిటిషనర్​కి అడ్డంకికాదని స్పష్టంచేసింది. తనను అరెస్ట్ చేయకుండా నిలువరించాలని కోరుతూ వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనను అక్రమంగా కేసులో ఇరికించే అవకాశం ఉందని ఈ విషయంలో అరెస్ట్ చేయకుండా పోలీసులను నిలువరించాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. తాజాగా నిర్ణయాన్ని వెల్లడించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వి. ఆదినారాయణరావు గతంలో వాదనలు వినిపిస్తూ, భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో పిటిషనర్​ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిందని గుర్తుచేశారు. అదే విషయంలో తప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేశారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారంలో ప్రస్తుతం నేరవిచారణ ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. సీఆర్‌పీసీ కల్పించిన అన్ని రకాల హక్కులు పిటిషనర్ కలిగి ఉంటారన్నారు. ఆందోళనతో పిటిషన్ వేయడం సరికాదన్నారు . నేర విచారణ ప్రక్రియ ప్రారంభించాల్సి వస్తే , అన్ని నిబంధనలను పాటిస్తామన్నారు .

మార్గదర్శకాలు ఏంటంటే..

ఏడేళ్ల లోపు లేదా ఏడేళ్ల వరకు శిక్షపడే నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల్ని పోలీసు అధికారులు అనవసరంగా అరెస్ట్ చేయవద్దని ' ఆర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ' కేసులో 2014 జులైలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. మెజిస్ట్రేట్ యాంత్రికంగా అరెస్ట్​ను ఆమోదించొద్దని తెలిపింది. నేర విచారణ ప్రక్రియ స్మృతి సెక్షన్ 41 ఏ ప్రకారం తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆ వ్యక్తులకు పోలీసు అధికారి నోటీసు జారీచేయాలని తేల్చిచెప్పింది. ఆ వ్యక్తులు విచారణకు హాజరైన సందర్భంలో వారిని అరెస్ట్ చేయాలని పోలీసు అధికారి భావిస్తే అందుకు కారణాలు తప్పక నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను పాటించడంలో ఉల్లంఘనలకు పాల్పడ్డ సంబంధిత పోలీసు అధికారి శాఖాపరమైన చర్యలకు, కోర్టుధిక్కరణ కింద శిక్షకు బాధ్యులవుతారని పేర్కొంది.

ఇదీ చదవండి : ఈనాడు కథల పోటీకి ఆహ్వానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.