ETV Bharat / city

TS High court : 'ఆ సినిమాపై అభ్యంతరాల విషయంలో జోక్యం చేసుకోలేం' - హైకోర్టు

TS High court On Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అభ్యంతరాల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లింలపై ద్వేషం కలిగించేలా సినిమాను చిత్రీకరించారంటూ ఎంఐఎం ఇంక్విలాబ్ పార్టీ నాయకుడు మహ్మద్ షమీఉల్లా ఖురేషి దాఖలు చేసిన దాఖలు చేసిన పిటిషన్​పై​ విచారణ చేపట్టింది.

High court
High court
author img

By

Published : Mar 24, 2022, 8:09 AM IST

TS High court On Kashmir Files: కశ్మీర్ ఫైల్స్ సినిమాపై అభ్యంతరాల విషయంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లింలపై ద్వేషం కలిగించేలా సినిమాను చిత్రీకరించారంటూ ఎంఐఎం ఇంక్విలాబ్ పార్టీ నాయకుడు మహ్మద్ షమీఉల్లా ఖురేషి దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. కశ్మీర్ పండిట్లకు ముస్లింలు వ్యతిరేకమనే భావన కలిగేలా సినిమా చిత్రీకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని చిత్రీకరించిన అంశాలు తొలగించేలా ఆదేశించాలని కోరారు.

కేంద్ర సెన్సార్ బోర్డు తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదించారు. సినిమాకు ఇప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ జారీ అయిందని తెలిపారు. సెన్సార్ సర్టిఫికెట్​పై అభ్యంతరాలు ఉంటే ట్రైబ్యునల్​ను ఆశ్రయించాలని.. నేరుగా హైకోర్టును ఆశ్రయించరాదని వాదించారు. ఇదే కారణంతో ఇటీవల ముంబయి హైకోర్టు అక్కడి పిటిషన్​ను కొట్టివేసిందని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా నేరుగా హైకోర్టును ఆశ్రయించారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో పిటిషన్ ఉపహసంహరించుకుంటానని ఖురేషి తరఫు న్యాయవాది కోరగా హైకోర్టు అంగీకరించింది.

ఇదీ చూడండి:CM KCR on Kashmir Files: 'ఈ కశ్మీర్ ఫైల్స్ ఏంటో.. దిక్కుమాలిన వ్యవహారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.