పీజీ మెడికల్ కౌన్సెలింగ్కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నూతన జీవోలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. 57, 58 జీవోలను అమలు చేస్తే ఓసీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో సీట్లు కోల్పోతారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్టే ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.
ఈ అంశంపై పూర్తి వివరాలతో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి..