రాజధాని ప్రాంత రైతులకు రెండు రోజుల్లో వార్షిక కౌలు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ఉత్తర్వులు జారీచేశారు. వార్షిక కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాలు చేస్తూ రైతులు కారుమండి పకీరయ్య , ఇడుపులపాటి సీతారామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సకాలంలో కౌలు చెల్లించకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది ఇంద్రనీల్ బాబు కోర్టు దృష్టికి తెచ్చారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ .. వార్షిక కౌలు చెల్లింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. రెండు రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: