ETV Bharat / city

HC ON SOCIAL MEDIA: అలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు : హైకోర్టు

author img

By

Published : Feb 26, 2022, 4:07 AM IST

HC ON SOCIAL MEDIA : న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ మాట్లాడినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా సహించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయవ్యవస్థపై అనుచిత పోస్టులు పెట్టిన హైకోర్టు న్యాయవాదులు..... మెట్ట చంద్రశేఖరరావు, గోపాలకృష్ణ కళానిధికి బెయిలు మంజూరుచేసింది.

high court
high court

HC ON SOCIAL MEDIA : న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ మాట్లాడినా , సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన సహించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణలు కోరడంతో కేసు విచారణను ధర్మాసనం మూసివేసిన నేపథ్యంలో సీబీఐ నమోదు చేసిన ప్రస్తుత కేసులో బెయిలు మంజూరు చేస్తున్నామని నిందితులైన హైకోర్టు న్యాయవాదులు మెట్ట చంద్రశేఖరరావు , గోపాలకృష్ణ కళానిధికి స్పష్టంచేసింది. సీబీఐ కోర్టులో రూ.50 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని పేర్కొంది. ప్రతి సోమవారం విజయవాడలోని సీబీఐ క్యాంప్ కార్యాలయంలో హాజరు కావాలని షరతు విధించింది. కేసు దర్యాప్తునకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శుక్రవారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.

ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో నిందితుడు సాఫ్ట్​వేర్ ఇంజనీర్ జి.రమేశ్ కుమార్​కు బెయిలు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ధర్మాసనం వద్ద ఆయనపై నమోదు చేసిన కోర్టుధిక్కరణ కేసు ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు , న్యాయవ్యవస్థపై అనుచితంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం , వీడియోలు అప్లోడ్ చేయడంపై నమోదు చేసిన కేసులో హైకోర్టు న్యాయవాది , ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సెల్ మెట్ట చంద్రశేఖరరావు , మరో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి , సాఫ్ట్​వేర్ ఇంజనీర్ రమేశ్ కుమార్ లను సీబీఐ అరెస్ట్ చేసింది.

ఇదీ చదవండి : HC ON SOCIAL MEDIA: న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను మీరే దిగజారుస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.