ETV Bharat / city

అధికారులు ఇచ్చిన నోటీసుకు ఏం సంజాయిషీ ఇచ్చారు? - ధర్మాసనం

కృష్ణానది కరకట్ట వద్ద నిర్మాణాన్ని వారం రోజుల్లో కూల్చేయాలంటూ సీఆర్​డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ..ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రరావు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హై కోర్టు విచారణ జరిపింది.

high_court_on_karakatta_issue
author img

By

Published : Sep 27, 2019, 5:50 AM IST

Updated : Sep 27, 2019, 11:09 AM IST

కరకట్ట వద్ద నిర్మాణాన్ని కూల్చేయాలంటూ... ఈనెల 19న సీఆర్​డీఏ ఇచ్చిన తుది నోటీసును సవాలు చేస్తూ ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. అధికారులు ఇచ్చిన నోటీసుకు సంజాయిషీ ఏమిచ్చారో... వివరాలతో సిద్ధపడి రావాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.
మరోవైపు కరకట్ట వద్ద తనకు చెందిన నిర్మాణాన్ని కూల్చివేయకుండా ఆదేశించాలని కోరుతూ పాతూరి సుధారాణి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంలో ఎస్జీపీ జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ఆందోళనతో కోర్టును ఆశ్రయించారన్నారు. తాము ఇచ్చిన సంజాయిషీ నోటీసులకు పిటిషనర్ వివరణ ఇచ్చారని, ఇంకా తుది ఉత్తర్వులు జారీచేయలేదని తెలిపారు. తొందరపాటు చర్యలు ఉండవని ధర్మాసనానికి తెలిపారు.

Intro:అనంతపురం జిల్లా బత్తల పల్లి మండలం డీ చెర్లోపల్లి గ్రామంలో పాము కాటుకు గురై చల్లా అనూష అనే మహిళా రైతు మృతి చెందింది వ్యవసాయ తోటలో పనిచేస్తున్న అనూషను కట్ల పాము కాటు వేసింది వైద్యం కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని తెలిపారు

Body:పాము కాటు తో మహిళా రైతు మృతి

Conclusion:అనంతపురం జిల్లా
Last Updated : Sep 27, 2019, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.