తెలంగాణలో పదోతరగతి పరీక్షలు జూన్ 8 తర్వాత నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం... పరీక్షా కేంద్రాల్లో కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.
ప్రతి పరీక్షకు మధ్య రెండ్రోజుల వ్యవధి ఉండాలని చెప్పిన హైకోర్టు... భౌతిక దూరం సాధ్యం కాని కేంద్రాలను మార్చాలని ఆదేశించింది. లాక్‌డౌన్ సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించవద్దని సూచించిన కోర్టు... పరిస్థితి తీవ్రంగా ఉంటే అసలు పరీక్షలు నిర్వహించవద్దని తెలిపింది.
ఇదీ చదవండి: విశాఖ ఎల్జీ ఘటనపై ఫేస్బుక్లో పోస్ట్.. వృద్ధురాలికి అరెస్ట్ నోటీసులు