హైకోర్టు ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని వేసిన పిల్‌పై విచారణ జరిగింది. రెడ్‌జోన్‌గా ప్రకటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్ ఫెడరేషన్ పిటిషన్ వేసింది. సస్పెన్షన్‌లో ఉన్న జడ్జి రామకృష్ణ అనుబంధ పిటిషన్‌కు అనుమతి కోరగా... పిల్‌లో ఎలా ఇంప్లీడ్ అవుతారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అభ్యంతరాన్ని కౌంటర్ రూపంలో వేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు..?: హైకోర్టు