విశాఖలో ప్రభుత్వ భూముల అమ్మకంపై.. టెండర్లు ఖరారు చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బిల్డ్ ఏపీ పేరిట భూముల అమ్మకాలపై ఇచ్చిన స్టే ఉత్తర్వులే.. విశాఖ భూముల అమ్మకానికి వర్తిస్తుందని వెల్లడించింది. విశాఖలో 5 చోట్ల భూముల అమ్మకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. టెండర్లు ఖరారు చేయవద్దంటూ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదీ చదవండి: 'అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది'