కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లు ఏ నేరానికి పాల్పడలేదని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఫిర్యాదుదారు ఎవరో .. అతను ఏ సామాజిక వర్గమో తనకు తెలియదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి..
Godavari River Management Board: ఆగస్టు 3న సమన్వయ కమిటీ భేటీ