High Court: రాయలసీమ యూనివర్శిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కళాశాలల్లో ఏవైనా లోపాలుంటే నెల రోజుల్లో సరిచేసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వర్శిటీ పరిధిలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపింది.
డిగ్రీ కళాశాలలకు షోకాజు నోటీసులిచ్చి.. వారి సంజాయిషీని పరిగణలోకి తీసుకోకుండా అడ్మిషన్లు ప్రారంభమైన 2 నెలల తర్వాత హఠాత్తుగా కళాశాలలను విద్యార్థులను చేర్చుకోకూడదని ఉత్తర్వులు జారీ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. అడ్మిషన్లు జరుపుకోవచ్చని, కళాశాలలో లోపాలుంటే నెల రోజుల్లో సరిచేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: