ఉపాధి హామీ పథకం(MGNREGS FUNDS) కింద రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిల చెల్లింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా లేవని హైకోర్టు(high court) పేర్కొంది . 2014 నుంచి ఎప్పుడు ఎన్ని నిధులు కేటాయించారు ?. ఇంతా చెల్లించాల్సిన బకాయిలెన్ని ?.. తదితర సమగ్ర వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయ మూర్తి కోరారు. శుక్రవారం జరిగిన విచారణలో కేంద్రం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాద్ వేసిన మోమోపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఎంత నిధులు కేటాయించారో అందులో వివరాలు లేవని ఆక్షేపించారు. మరోవైపు బకాయిల చెల్లింపు కోసం తాజాగా దాఖలైన మరికొన్ని వ్యాజ్యాల్లో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విచారణను ఆగస్టు 16కు వాయిదా వేశారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(MGNREGS FUNDS) కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు కేటాయించారు?. తదితర వివరాలు సమర్పించాలని గత విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించామని చెబుతున్న నేపథ్యంలో ఆ సొమ్ము అందిందా ? లేదా ? వివరాల్ని తెలుసుకొని చెప్పాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులకు స్పష్టం చేసింది. విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బుట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.
ఇదీ చదవండి..
దేవినేని ఉమా పిటీషన్‌పై హైకోర్టులో విచారణ.. మంగళవారానికి వాయిదా