ఆలయాలపై వరుస దాడుల ఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరడం అపరిపక్వం అవుతుందని ధర్మాసనం పేర్కొంది. దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనలపై దర్యాప్తు జరిపి.. తార్కిక ముగింపు పలకాలని సిట్‌కు స్పష్టం చేసింది. నిందితుల్ని పట్టుకోవడంలో సిట్ విఫలమైతే.. పిటిషనర్ కోర్టును ఆశ్రయించొచ్చని తెలిపింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. దాడుల్ని నివారించేందుకు ఏపీ హోంశాఖ ముఖ్యకార్యదర్శి తదితరులు చర్యలు తీసుకోవడం లేదని కొత్తూరుతాడేపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు.
ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరానికి పాల్పడినట్లు లేదు
గతేడాది డిసెంబరు 6న తమ ఇంటికొచ్చి కొందరు బెదిరించారంటూ వైకాపా ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన బి.లక్ష్మీనారాయణ, మరో 16 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 22న ఈ వ్యాజ్యంపై విచారణ చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్.. ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలు ఎస్సీ ఎస్టీ చట్టం కింద శిక్షించదగ్గ నేరానికి పిటిషనర్లు పాల్పడినట్లు ప్రాథమికంగా కనిపించడం లేదని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లోని ఇతర సెక్షన్లు.. ఏడేళ్లలోపు శిక్షకు అవకాశమున్నవని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లకు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులనిచ్చి వివరణ తీసుకోవాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు.
ఇదీ చదవండి: