ETV Bharat / city

'ప్రైవేటు భూముల కొనుగోళ్లను నేరంగా పరిగణించడం ఏమిటి?' - అమరావతి భూములు కొనుగోళ్లపై సీఐడీ కేసులు

అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారనే ఆరోపణతో సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ తీర్పును రిజర్వు చేశారు. భూ కొనుగోళ్ల దస్త్రాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్లకు సూచించారు.

High court hearing
High court hearing
author img

By

Published : Dec 3, 2020, 6:00 AM IST

Updated : Dec 3, 2020, 6:34 AM IST

రాజధాని నిర్మాణం ఎక్కడ ఏర్పాటు కానుందో అప్పటి ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం సేకరించి అమరావతి చుట్టుపక్కల పలువురు భూములు కొనుగోలు చేశారని పేర్కొంటూ వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కె. శ్రీహాస, కిలారు. రాజీవ్, నార్త్ ఫేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వీ, లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ తదితరులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ .. ' రాజధాని నగర ప్రాంతానికి వెలుపల భూములు కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేయడమే తప్పు ఎలా అవుతుంది. 2014 నుంచే అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. భూ యజమానులు స్వచ్ఛందంగా విక్రయించడంతో పిటిషనర్లు కొనుగోలు చేశారు. కొనుగోళ్ల వెనుక కుట్ర ఉందనేందుకు ఆధారాలు లేవు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పోలీసులు నమోదు చేసిన కేసును రద్దు చేయండి' ఆయన కోర్టును కోరారు.

కొనుగోళ్లలో నేరపూరిత కుట్ర ఉంది : ఏజీ

మరికొందరి పిటిషనర్ల తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు కొనుగోలు చేయడం వల్ల పిటిషనర్లే నష్టపోయారన్నారు. రాజధాని ప్రాంతానికి దూరంగా భూములు కొనుగోలు చేయడం నేరంగా పేర్కొనడం సరికాదన్నారు. భూకొనుగోళ్ల వెనుక దురుద్దేశాలు లేవని మరో న్యాయవాది కిశోర్‌ రెడ్డి తెలిపారు. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్( ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. గత ప్రభుత్వ పెద్దల సన్నిహితులు భూములు కొన్నారన్నారు. ఈ విషయంలో కుట్రకోణం ఉందన్నారు. ప్రాథమిక ఆధారలున్నాయని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు చేసేందుకు అనుమతించాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ .. ప్రైవేటు భూముల కొనుగోళ్లను నేరంగా పరిగణించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదుకదా అని వ్యాఖ్యానించారు. ఏజీ బదులిస్తూ .. నేరపూరిత కుట్ర ఉన్నందున పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సివిల్ కొనుగోళ్ల వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు.

ఇదీ చదవండి : 'ప్రభుత్వం సభా నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది'

Last Updated : Dec 3, 2020, 6:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.