ETV Bharat / city

గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ల నియామకంపై యథాతథ స్థితి - హైకోర్టు తాజా ఉత్తర్వులు

గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం విషయంలో హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తమను విధులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ దాసరి రాజ మాస్టార్ తో పాటు పలు జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

High Court
హైకోర్టు
author img

By

Published : Jul 25, 2021, 8:34 AM IST

గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్ల నియామకం విషయంలో హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. విచారణను గురువారానికి వాయిదా వేశారు .

హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం తమను విధులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ దాసరి రాజ మాస్టార్ తో పాటు పలు జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తమ స్థానంలో కొత్తగా ఛైర్మన్లను నియమించినట్లు ఓ పత్రిక ఈనెల 18న వార్తా కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు. కొత్త వారికి బాధ్యతలు అప్పగించకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరారు. తమను ఛైర్మన్లుగా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మే 4న హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమను ఛైర్మన్లుగా కొనసాగేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

ఇదీ చదవండి

Mansas Trust: 'నా ఆదేశాలకు కట్టుబడేలా ఈవోను నిర్దేశించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.