ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేస్తూ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం రద్దు చేసింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరిపేందుకు యత్నిస్తున్నారని పేర్కొంటూ ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్ మోహన్ దాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం... ఎన్నికల నిర్వహణను నిలిపేస్తూ ఆగస్టు 9న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సిహెచ్ అరుణ్ కుమార్ ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు.... సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: