సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు గత ఆరు నెలలుగా ఎలాంటి చర్యలు చేపట్టారో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని.. సహకార సంఘ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ ఆ నిబంధనల నుంచి రాష్ట్రంలోని అన్ని సహకార సంఘాల్ని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 475ను సవాల్ చేస్తూ.. సంఘాలకు ఇంఛార్జ్‌లను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. సహకార సంఘ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించగా.. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం నిర్వహిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది సమాధానమిచ్చారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. గత ఆరు నెలలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: