విశాఖ వైద్యుడు సుధాకర్‌ను మానసిక చికిత్సాలయం నుంచి మరో ఆసుపత్రికి మార్చాలని వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కోర్టు సెలవుల తర్వాత తదుపరి విచారణ ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న మానసిక ఆస్పత్రి నుంచి సుధాకర్‌ను మార్చాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ న్యాయస్థానాన్ని కోరారు. వైద్యుడి మానసిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని ప్రాథమికంగా సర్టిఫికెట్ ఉన్నప్పుడు... మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ సమక్షంలో కానీ, స్థానిక న్యాయవాది సమక్షంలో కానీ పిటిషన్‌పై ఆయన సంతకం చేశారా..? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.
ఆ వివరాలను పిటిషన్లో పొందుపరచలేదని.. టైపోగ్రాఫికల్ తప్పులు జరిగాయని.. వీటిని సరిదిద్దుకుంటామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.
వైద్యుడు సుధాకర్‌ను వేరే ఆసుపత్రికి తరలించాలని ఆయన తల్లి, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మానసిక ఆస్పత్రిలో చికిత్సపై వారంతా అనుమానం వ్యక్తం చేశారు. అందుతున్న చికిత్సపై సుధాకర్లో భయాందోళన మొదలైందని తెలిపారు. విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వైద్యుడు సుధాకర్ లేఖ కూడా రాశారు. 6వ వార్డు చీఫ్‌గా ఉన్న డాక్టర్ రామిరెడ్డి గత 15 రోజులుగా ఎలాంటి వైద్యం అందించటం లేదని.. చిరాకు తెప్పిస్తున్నారని ఆరోపించారు. చికిత్స కోసం మరో యూనిట్‌కు తరలించాలని లేఖలో కోరారు.
ఇవీ చదవండి: