ETV Bharat / city

తేడావస్తే "రంగు పడుద్ది.." హోలీ జాగ్రత్తలు తీసుకున్నారా?

Holi Tips: హోలీ.. అంటే యాక్షన్ కాదు.. ఓవరాక్షన్. మామూలు రచ్చ కాదు.. రచ్చ రంబోలా.. అట్లుంటది మన యూత్ తోటి! ఒక్క రంగు చల్లడంతో మొదలయ్యే హంగామా.. వింత వింత కలర్లు పులుముకునే వరకూ వెళ్తుంది. ఆనందం హద్దులు దాటుతున్నకొద్దీ.. హోలీ తీరుకూడా మారిపోతూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తగిన జాగ్రత్తలు అవసరం అంటున్నారు నిపుణులు. ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. "రంగు పడుద్ది" అని హెచ్చరిస్తున్నారు.

తేడావస్తే రంగు పడుద్ది.. హోలీ జాగ్రత్తలు తీసుకున్నారా?

author img

By

Published : Mar 18, 2022, 9:18 AM IST

Holi Tips: హోలీ రంగులు ముందుగా పులుముకునేది ముఖానికే. కాబట్టి.. ముందుగా ముఖాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఇందుకోసం.. ముందస్తుగా రెండు, మూడు లేయర్లుగా మాయిశ్చరైజర్‌ రాయాలి. చెవులు, వాటి వెనక భాగాల్నీ వదలొద్దు. ఇది రంగుల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. కనీసం ఎస్‌పీఎఫ్‌ 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను తప్పక రాయాలి. నీళ్లతో ఆడే అవకాశాలే ఎక్కువ కాబట్టి, వాటర్‌ప్రూఫ్‌వి ఎంచుకుంటే మంచిది.

కనీసం 15-20 నిమిషాల ముందు ఆలివ్‌, బాదం, కొబ్బరి నూనెల్లో ఏదో ఒకదాన్ని తప్పక మేనంతా రాసుకోండి. పెదాలనూ నిర్లక్ష్యం చేయొద్దు. పెట్రోలియం జెల్లీ పూయండి. లిప్‌స్టిక్‌ అలవాటున్నా.. దీన్ని రాశాకే అప్లై చేయండి. గోళ్లు పెద్దగా ఉంటే కత్తిరించాలి. లేదంటే వాటిల్లోకి చేరిన రంగులు ఆహారంతో కలిసి కడుపులోకి వెళ్లే ప్రమాదముంది. నెయిల్‌ పెయింట్‌ వేస్తే.. గోళ్లపై మరకల్లా ఉండిపోవు, నిర్జీవంగానూ తయారవకుండా ఉంటాయి.

వెంట్రుకలూ రసాయనాల వల్ల తేమను కోల్పోతాయి. కాబట్టి, కొబ్బరి లేదా బాదం నూనెను మాడు నుంచి చివర్ల వరకు తప్పక పట్టించాలి. జిడ్డుగా కనిపిస్తుందనిపిస్తే.. లీవ్‌ ఇన్‌ కండిషనర్‌ రాస్తే సరి. తలస్నానం చేశాక చిక్కులు తొలగడానికీ, మెరవడానికీ సీరంగా ఉపయోగిస్తాం కదా! అదే ఇది. ఈ జాగ్రత్తలు పాటించేయండి.. పండగ తర్వాతా ఆనందమే గుర్తుంటుంది.

కళ్లు మరింత భద్రం సుమా..
చిన్నాపెద్దా కలిసి రంగులు పూసుకొని హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవడం ఆనవాయితీ. కొన్నిసార్లు చిన్న పొరపాటు.. చిన్న నిర్లక్ష్యం.. ఆ సంతోష వాతావరణాన్ని విషాదం వైపు నడిపిస్తుంటుంది. అలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉత్సవం జరుపుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. నేడు హోలీ పండుగ నేపథ్యంలో రంగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నేత్రాల విషయంలో జాగ్రత్త అవసరమని నేత్ర వైద్యులు డాక్టర్‌ అరోరా సూచిస్తున్నారు.

  • హోలీలో ఎక్కువగా సింథటిక్‌ రంగులు వాడుతుంటారు. రసాయనాలతో కూడిన రంగులు చర్మంతోపాటు నేత్ర ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
  • పారిశ్రామిక డైలు, ఆల్కాలీస్‌తో తయారైన ఈ రంగుల్లో సింథటిక్‌, ఆస్బెస్టాస్‌, సిలికా, మైకా, సీసం వంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి విషపూరితమైనవి. వీటి వల్ల కొన్నిసార్లు శాశ్వతంగా చూపు దెబ్బతింటుంది.
  • ప్రస్తుతం చాలా మంది కాంటాక్ట్‌ లెన్సులు వాడుతుంటారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లలో రంగులు పడకుండా చూసుకోవాలి.
  • కాంటాక్ట్‌ లెన్సుల్లో హైగ్రోస్కోపిక్‌ లక్షణాలు కలిగి ఉంటాయి. దాంతో అవి సులభంగా నీటిని పీల్చుకుంటాయి. ఈ క్రమంలో రంగు నీళ్లు కళ్లలో పడితే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది.
  • కళ్లల్లో రంగు పడితే నులమకూడదు. అలా చేస్తే కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతింటుంది. కంటిలో రంగు పడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకొని, అరచేతిలోకి స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని ఆ నీటిలో కళ్లను సున్నితంగా కదిలించే ప్రయత్నం చేయాలి.
  • కంట్లో నీరు చిమ్మడం, చేతి రుమాలు, టిష్యూ ఉపయోగించి కంటిలో చిక్కుకున్న నలుసు తొలగించే ప్రయత్నం కూడా చేయకూడదు. అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది.
  • ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సూచనలు లేకుండా ఐడ్రాప్స్‌, ఆయింట్‌మెంట్‌లు వాడకూడదు.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.