ETV Bharat / city

వేములవాడలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం - rajanna sircilla dictrict news

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా.. తెలంగాణలోని వేములవాడ రాజన్న సన్నిధిలో హెలిటాక్సీ సేవలను ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. 14వ తేదీ సాయంత్రం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

heli taxi service inaugurated in vemulavada
వేములవాడలో హెలికాప్టర్ సేవలు ప్రారంభం
author img

By

Published : Mar 10, 2021, 7:29 PM IST

మహా శివరాత్రి సందర్భంగా తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి.. హెలీటాక్సీ సేవలను ఎస్పీ రాహుల్​ హెగ్డే ప్రారంభించారు. ఈ నెల 14 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్​. అంజయ్య, బి. సత్యనారాయణ, జడ్పీ ఛైర్​పర్సన్​ అరుణ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయ అధికారులతో కలిసి విహంగ వీక్షణం ద్వారా ఆలయ పరిసరాలు, ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.​ నాంపల్లి నుంచి వేములవాడ వరకు 7 నిమిషాల హెలికాప్టర్​ ప్రయాణానికి రూ.3 వేలు చొప్పున టిక్కెట్, తిరుగు ప్రయాణంలో మధ్య మానేరు డ్యామ్ అందాలను వీక్షించేందుకు వీలుగా 15 నిమిషాల ప్రయాణానికి రూ. 5500 చొప్పున ప్రయాణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చదవండి: బద్రినాథుణ్ని దర్శించాలంటే.. సిద్దిపేట వెళ్లాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.