ETV Bharat / city

తెలంగాణలో కఠినంగా లాక్​డౌన్​.. సరిహద్దులో భారీగా ఏపీ వాహనాల నిలిపివేత - gadwal district latest news

తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. కరోనా కట్టడి కోసం లాక్​డౌన్​ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించేవారికి అధికారులు ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు.

Heavy vehicles parked at the toll plaza
టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు
author img

By

Published : May 23, 2021, 9:02 AM IST

కరోనా కట్టడి కోసం తెలంగాణ రాష్ట్రంలో లాక్​డౌన్​ కఠినంగా అమలవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు. అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మాత్రం ఈ-పాస్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. లాక్‌డౌన్‌ సడలింపు వేళల్లోనూ ఈ-పాస్‌ ఉన్నవారినే అనుమతిస్తున్నారు.

ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద.. ఏపీకి చెందిన వాహనాలు భారీగా నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపు ఉందని వాహనదారులు భారీగా తరలిరావడంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ-పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ-పాస్​లు లేని వాహనదారులను నిలిపివేస్తున్నారు. మరోవైపు సరకు రవాణా వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి:

కరోనా వేళ ఎయిర్ అంబులెన్సులకు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.