ETV Bharat / city

సీఎం కేసీఆర్​ కాన్వాయ్ రాకతో, హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ - Munugodu By Poll

CM KCR Convoy causes Traffic Jam in Hyderabad తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో నిర్వహిస్తున్న ప్రజాదీవెన సభకు వెళ్తున్నారు. 400 కార్లు ర్యాలీగా బయలుదేరగా సీఎం కాన్వాయ్ హబ్సీగూడ నుంచి మునుగోడు వెళ్తోంది. తెరాస శ్రేణుల కోలాహలంతో నగర రహదారులన్నీ సందడిగా మారాయి. మరోవైపు సీఎం కాన్వాయ్ రాకతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ighway trafficjam
ighway trafficjam
author img

By

Published : Aug 20, 2022, 3:57 PM IST

CM KCR Convoy causes Traffic Jam in Hyderabad హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో ప్రజాదీవెన సభకు ఈ మార్గం ద్వారానే వెళ్తున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పోలీసులు ట్రాఫిక్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ప్రజలను ఆ మార్గంలో వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. నగరంలోని హబ్సీగూడ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్ వద్ద విద్యుత్ తీగలు కిందకు వేలాడటంతో దాదాపు 41 నిమిషాలు రాకపోకలు నిలిచిపోయాయి. సీఎం కాన్వాయ్‌తో ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలకు వెళ్లే వారు, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు.

మునుగోడు ప్రజా దీవెన సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్టీ శ్రేణులతో కలిసి సీఎం బస్సులో వెళ్తున్నారు. పార్టీ నేతల భారీ కాన్వాయ్‌ సీఎం వెంట వస్తోంది. ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు ఆయా ప్రాంతాల్లో.. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. సీఎం వెళ్లే మార్గమంతా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సందడిగా నెలకొంది.

సీఎం కాన్వాయ్ రాకతో, హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.