అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో... లోతట్టు కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీచేసింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. సహాయం కోసం నం. 040- 2955 5500 సంప్రదించాలని తెలిపారు.
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సోమవారం అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఓల్డ్ కొత్తగూడెం 19.9సెంటీ, చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 18.8, పాల్వంచ మండలం సీతారాంపట్నం 18.8, వరంగల్ జిల్లా సంగెంలో 18.7, చెన్నారావు పేటలో 16.6, నడికూడలో 16.0, హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టులో 12.5, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 12.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో వర్షపాతం వివరాలు..
జిల్లా | ప్రాంతం | వర్షపాతం(సెం.మీ) |
కొత్తగూడెం | కొత్తగూడెం | 19.9 |
కొత్తగూడెం | గరిమెళ్ళపాడు | 18.8 |
కొత్తగూడెం | సీతారాంపట్నం | 18.8 |
వరంగల్ రూరల్ | సంగెం | 18.7 |
వరంగల్ రూరల్ | చెన్నారావుపేట్ | 16.7 |
వరంగల్ రూరల్ | నడికుడ | 16.0 |
కొత్తగూడెం | నాగుపల్లె | 15.5 |
కొత్తగూడెం | లక్ష్మీదేవిపల్లి | 14.9 |
కొత్తగూడెం | టేకులపల్లి | 14.7 |
కొత్తగూడెం | అంకంపాలెం | 14.6 |
కొత్తగూడెం | ములకలపల్లి | 13.8 |
వరంగల్ అర్బన్ | చింతగట్టు | 12.5 |
మహబూబాబాద్ | బయ్యారం | 12.5 |
వరంగల్ రూరల్ | దుగ్గొండి | 12.5 |
కొత్తగూడెం | సుజాతనగర్ | 12.0 |
కొత్తగూడెం | యనంబైలు | 12.0 |
వరంగల్ అర్బన్ | ఎల్కతుర్తి | 11.9 |
ఇవీ చూడండి: