ETV Bharat / city

Godavari River: గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ - హైదరాబాద్ తాజా వార్తలు

Godavari River: ఎడతెరిపిలేని వానలతో గోదావరి నదికి తెలంగాణలో వరద పోటెత్తుతోంది. గోదావరి జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహం పరుగులు తీస్తోంది. శ్రీరాంసాగర్‌ నుంచి భద్రాద్రి వరకు భారీగా వరద కొనసాగుతోంది. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

గోదావరి ఉగ్రరూపం.
గోదావరి ఉగ్రరూపం.
author img

By

Published : Jul 11, 2022, 9:33 AM IST

గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. శ్రీరామసాగర్‌ నుంచి భద్రాద్రి వరకు నదిలో భారీ ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు ఉపనదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. గోదావరికి భారీగా వరద వస్తుండటంతో ఆదివారం సాయంత్రం 6.45 గంటలకు శ్రీరామసాగర్‌ 9 వరద గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. మరో 10 వేల క్యూసెక్కులు వరద కాలువకు విడుదల చేస్తున్నారు.

వాస్తవానికి పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు చేరాక గాని మిగులు జలాలు వదలరు. గోదావరికి వరద పోటెత్తుతుండటం, సోమ, మంగళ వారాలు భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందుగానే గేట్లు తెరిచారు. గడిచిన రెండు రోజుల్లోనే ప్రాజెక్టులో 41 టీఎంసీల నిల్వ పెరిగింది. శుక్రవారం 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 30 టీఎంసీల నిల్వ ఉంది. ఆదివారం సాయంత్రానికి 1086 అడుగుల వద్ద 71 టీఎంసీలు నిల్వ ఉంది.

శనివారం 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే ఆదివారం ఉదయానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. సాయంత్రానికి 2.75 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం వరకు 27 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తి 3,44,239 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న పార్వతి (సుందిళ్ల) బ్యారేజీకి వదిలారు. సరస్వతి(అన్నారం) బ్యారేజీకి 3.55 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 50 గేట్లు తెరిచి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి 9.96 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 75 గేట్లను ఎత్తి దిగువకు అంతే మొత్తం వదులుతున్నారు. భద్రాద్రి జిల్లా పేరూరు వద్ద శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 14.73 అడుగుల మట్టం పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఆదివారం రాత్రి 12 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.. పెదవాగు సామర్థ్యం 0.6 టీఎంసీలు కాగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరటంతో 4,028 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటి ప్రవహిస్తుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

మరోవైపు కృష్ణా పరీవాహకంలోనూ వరద పెరుగుతోంది. ఆలమట్టి జలాశయానికి ఎగువన ఉన్న డ్యాంలన్నీ నిండటానికి చేరువయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఆలమట్టి నుంచి దిగువకు భారీ ప్రవాహం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నానికి ఈ జలాశయానికి 75,149 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. తుంగభద్ర జలాశయానికి కూడా 88,287 క్యూసెక్కులు వస్తోంది. 12 గంటల వ్యవధిలో 3.81 టీఎంసీల నీల్వ చేరుతోంది. ఆలమట్టి, తుంగభద్ర జలాశయాల నుంచి 5 రోజుల వ్యవధిలో దిగువకు ప్రవాహం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

..

నిండు కుండల్లా వాగులు, వంకలు: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మధ్య, చిన్న తరహా నీటి వనరులు నిండుకుండల్లా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో చెరువులు అలుగు పోస్తున్నాయి. కిన్నెరసాని, మల్లన్నవాగు, జల్లేరు, తాలిపేరు, మూసీ, ముర్రేడు, మున్నేరు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ, జగన్నాథపూర్‌, శ్రీపాద ఎల్లంపల్లి, పీపీరావు, కుమురంభీం, మత్తడివాగు, వట్టివాగు జలాశయాలు పూర్తిగా నిండటంతో వరదగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

..

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలో నీరు 28 అడుగులకు చేరింది. దీని సామర్థ్యం 31 అడుగులు కాగా పాల్వంచ వాగు ఉద్ధృతంగా పారడంతో ఆదివారం సాయంత్రానికి 28 అడుగులకు నీరు చేరింది. ఇదే జిల్లా చందుర్తి మండలంలోని ఎల్లంపల్లి-450 కాలువకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీ గండి పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లిలో పెదవాగు ఉద్ధృతికి రహదారి కోతకు గురైంది.

..

హిమాయత్‌సాగర్‌కు వరద నీరు: మొయినాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్‌ నిండుకుండలా మారుతోంది. ఆదివారం ఉదయం నీటిమట్టం 1760.25 అడుగుల్లో ఉండగా, సాయంత్రానికి రూ.1760.50 అడుగులకు చేరింది. ఆదివారం సాయంత్రం జలమండలి అధికారులు రెండు క్రస్టుగేట్లను అడుగు మేర పైకి ఎత్తి వరదను దిగువకు వదిలారు. ఇక గండిపేట జలాశయానికి సంబంధించి మూసీ వాగులో మోస్తరు వరద ప్రవాహం పారుతోంది.

భారీ ప్రవాహంతో దిగువకు: గోదావరి నది ప్రవాహం భీకర రూపం దాల్చుతోంది. ఉప నదుల కలయికతో వాటినుంచి వరదనీరు రావడంతో కాళేశ్వరం- భద్రాచలం మధ్య ఉగ్రరూపాన్ని దాల్చుతోంది. వాతావరణ శాఖ ఉపగ్రహం నుంచి తీసిన చిత్రాన్ని పరిశీలిస్తే ఏటూరునాగరం నుంచి పేరూరు, వాజేడు, దుమ్ముగూడెం, భద్రాచలం మధ్యలో 40 అడుగుల నుంచి 45 అడుగుల వరకు నీటి మట్టం కనిపిస్తోంది. నదికి వస్తున్న వరద అంచనాలు పక్కనున్న ఉపగ్రహ చిత్రంలో చూడవచ్చు.

..
..
..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.