ETV Bharat / city

హైదరాబాద్​లో కుండపోత.. ముంపులో లోతట్టు ప్రాంతాలు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి! - తెలంగాణ తాజా వార్తలు

Heavy rains in Hyderabad: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. హైదరబాద్‌లో కుండపోత వర్షం కురవడంతో.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగర ప్రజలు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై భారీగా వరద చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

rain
rain
author img

By

Published : Oct 9, 2022, 7:24 AM IST

Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహాదారులపై భారీగా వరద చేరడంతో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు, నాళాలు పొంగిపొర్లాయి. ప్రధానంగా షేక్‌పేట్, గచ్చిబౌళి, నీజాంపేట్‌, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, రాజేంద్రనగర్, సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. అలాగే ఎస్​ఆర్​ నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, తార్నక, అంబర్‌పేట్‌ తదిదరప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

చెరువులు తలపించిన రోడ్లు: ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లన్ని చెరువులను తలపించాయి. అత్యధికంగా షేక్‌పేట్‌లో 117.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. మాదాపూర్‌లో 109, జూబ్లిహిల్స్‌లో 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నారు. జీహెచ్​ఏంసీ అధికారులు రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు.

మరో రెండు రోజులు ఇదే పరిస్థితి: లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లద్దని వాతావరణ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

rain

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.