పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉండగా...ఉభయగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇవాళ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు రేపు దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని తెలిపింది. రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి