ETV Bharat / city

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీట మునిగిన పలు కాలనీలు - Telangana weather latest news

Hyderabad Rains Today: తెలంగాణలోని హైదరాబాద్‌లో నిన్నరాత్రి కురిసిన భారీ వర్షం.. జనాన్ని ఇబ్బందులకు గురిచేసింది.  లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.  రహదారులు చెరువుల్లా మారి.. నగరవాసులు నరకం అనుభవించారు. రోడ్లపై చేరిన వరదలో.. ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి నీళ్లు చేరింది.

rain in hyderabad
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..
author img

By

Published : Oct 13, 2022, 8:01 AM IST

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..

తెలంగాణలోని భాగ్యనగరాన్ని వరుణుడు.. వణికిస్తూనే ఉన్నాడు. బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్‌ జోన్లలో భారీ వర్షం కురిసింది. బొరబండ పరిధిలోని కాలనీల్లో వరద పోటెత్తింది. ఇళ్ల ముందు పార్క్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు.

ఖైరతాబాద్, అమీర్‌పేట్‌, ఎల్లారెడ్డిగూడ రోడ్డు జంక్షన్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్ వంటి ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. బేగంపేట్‌లో నీరు రోడ్లపై నిలవడంతో అర్థరాత్రి వరకూ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఎస్.ఆర్.నగర్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సుమారు 2 గంటల నుంచి 4 గంటల వరకు కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.

లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీటితో జనాలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముంపు ప్రమాదం ఎక్కువ ఉన్న కాలనీల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వరదతో నాలాలు పొంగిపొర్లాయి.

ఎగువన కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పెరుగుతోంది. ఉస్మాన్‌సాగర్‌కు 900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. 4 గేట్లు ఎత్తి 952 క్యూసెక్కల వరదను మూసీలోకి విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 1373 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.