ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లోనూ చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఈ నెల 28వ తేదీ నుంచి నైరుతి రుతుపవనాలు క్రమంగా వైదొలగుతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్టు తెలియచేసింది.
రాష్ట్రంలో నమోదైన వర్షపాతం వివరాలు
- బ్రహ్మంగారి మఠం 12.3 సెంటిమీటర్లు
- తాడిమర్రి - 11 సెంటిమీటర్లు
- మచిలీపట్నం - 4.5 సెంటిమీటర్లు
- ఆళ్లగడ్డ -4.3 సెంటిమీటర్లు
- కంభం - 3.4 సెంటిమీటర్లు
- చిన్నగొట్టిగల్లు - 3.1 సెంటిమీటర్లు
- ఎస్.కోట - 3 సెంటిమీటర్లు
- అనంతగిరి - 2.5 సెంటిమీటర్లు
- సీతానగరం 2.1 సెంటిమీటర్లు
- మార్కాపురం 1.9 సెంటిమీటర్లు
- జగ్గయ్యపేట 1.9 సెంటిమీటర్లు
- నెల్లూరులో 1.4 సెంటిమీటర్లు