ETV Bharat / city

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..!

Illegal gold mining in Shamshabad: శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో అక్రమంగా తరలిస్తున్నా భారీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దుబాయ్ వస్తున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి సుమారు 7.69 కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు వివరించారు. అదే విధంగా ఈరోజు కూడా మరో ముగ్గురు ప్రయాణీకుల దగ్గర నుంచి 3.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

gold
gold
author img

By

Published : Oct 7, 2022, 9:57 PM IST

Illegal gold mining in Shamshabad: అధికారులు ఎన్ని జాగ్రర్త చర్యలు తీసుకున్నా.. కట్టు దిట్టమైన తనిఖీలు చేపట్టినా తెలంగాణ శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణీకుల నుంచి నాలుగు కోట్ల విలువ చేసే 7.69కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

బుధవారం దుబాయ్‌ నుంచి వస్తున్న ప్రయాణీకులపై పక్క సమాచారంతో తనిఖీలు చేయగా ఓ ప్రయాణీకుడు నుంచి 4.895 గ్రాముల బంగారం లభించగా.. మరో ఇద్దరు ప్రయాణీకుల నుంచి 2.800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 4కోట్లు ఉంటందని అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇంత మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకోవడం ఇదేనని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

ఈ రోజు 3.5 కిలోల బంగారం పట్టివేత: ఈ రోజు కూడా దుబాయ్‌ నుంచి వస్తోన్న ముగ్గురు ప్రయాణీకుల నుంచి దాదాపు 3.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించగా లోదుస్తుల్లో దాచుకుని బంగారం సరఫరా చేసినట్లు గుర్తించారు. పేస్ట్‌ రూపంలో ఉన్న బంగారాన్ని డ్రాయర్లు, జాకెట్ల మధ్యలో బంగారాన్ని దాచి తెచ్చారని.. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 1.4 కోట్లు ఉంటుందిని అంచాన వేస్తున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ముంబయికి చెందిన వారుకాగా మరొకరు హైదరాబాద్‌కు చెందిన మహిళగా గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.