సీఎం జగన్ బెయిల్ రద్దుచేయాలంటూ.. ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. రఘురామ రీజాయిండర్‌పై రిప్లయ్ దాఖలు చేస్తామని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రీజాయిండర్‌పై లిఖితపూర్వక వివరణ అవసరం లేదని కోర్టు పేర్కొంది.
రీజాయిండర్‌లో కొత్త విషయాలు వెనక్కి తీసుకుంటే రిప్లయ్ అవసరం లేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు వినిపించాలంటూ.. విచారణ వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
Sachivalayam: 13 నెలలుగా అద్దె చెల్లించడంలేదంటూ.. గ్రామ సచివాలయానికి తాళం!