ETV Bharat / city

ఆ అధికారికి మూడు నెలలు జైలు శిక్ష, జరిమానా.. - హైకోర్టు వార్తలు

కోర్టుధిక్కరణ కేసులో డీఎంఈ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావుకు.. హైకోర్టు మూడు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అప్పీల్‌ వేసేందుకు వీలుగా ఆదేశాల అమలును సస్పెండ్‌ చేయాలని కోరగా..అంగీకరించిన న్యాయమూర్తి తీర్పు అమలును వారం నిలుపుదల చేశారు.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 24, 2022, 4:58 AM IST

కోర్టుధిక్కరణ కేసులో వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావుకు హైకోర్టు మూడు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అప్పీల్‌ వేసేందుకు వీలుగా ఆదేశాల అమలును సస్పెండ్‌ చేయాలని డీఎంఈ తరఫు న్యాయవాది కోరారు. అంగీకరించిన న్యాయమూర్తి తీర్పు అమలును వారం నిలుపుదల చేశారు. ఈలోపు అప్పీల్‌ వేయకపోయినా, వేశాకస్టే లభించకపోయినా.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ ముందు ఈ నెల 29 సాయంత్ర 5 గంటల్లోపు హాజరుకావాలని డీఎంఈని ఆదేశించారు.తర్వాత ఆయన్ను జైలుకు పంపాలని రిజిస్ట్రార్‌ జ్యుడిషియల్‌కు స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి ఈ నెల 22న ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

కర్నూలు వైద్య కళాశాలలో 2018-19 సంవత్సరానికి అసోసియేట్‌ ప్రొఫెసర్లు పోస్టులు ఖాళీగా లేవు. ఆ కళాశాల నుంచి ఆ ఏడాది పదోన్నతి కౌన్సెలింగ్‌లో పాల్గొన్న ముగ్గురు వైద్యులు.. అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ఇతర కళాశాలలకు వెళ్లేందుకు అంగీకరించారు. వారు అంగీకరించిన స్థానాలకు వెళ్లకుండా కర్నూలు వైద్య కశాశాలలోనే కొనసాగారు. తర్వాత సంవత్సరాల్లో కర్నూలు వైద్య కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు ఏర్పడిన ఖాళీల్లో ఆ ముగ్గుర్ని నియమిస్తూ డీఎంఈ 2020 అక్టోబర్‌ 10న ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాలు చేస్తూ కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సి.సునీత, డాక్టర్‌ ఎ.సుధారాణి 2020 డిసెంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురు పదోన్నతి పొందినా ఉద్దేశపూర్వకంగానే వేరేచోట చేరలేదన్నారు. దీంతో అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతికి అర్హులమైన తాము నష్టపోయామన్నారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. డీఎంఈ ఉత్తర్వులను సస్పెండ్‌ చేశారు. అయినప్పటికీ ఆ ముగ్గురు కర్నూలు వైద్య కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా కొనసాగుతున్నారంటూ సునీత, సుధారాణి కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి.. ముగ్గురి విషయంలో ప్రొసీడింగ్స్‌ను న్యాయస్థానం సస్పెండ్‌ చేశాక వారికి కర్నూలు వైద్య కళాశాలలో కాకుండా ఇతర కళాశాలలో పోస్టింగ్‌ ఇవ్వాలన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తర్వాత ప్యానల్‌ సంవత్సరంలో ఖాళీలు ఏర్పడే వరకు వారిని అదే కళాశాలలో కొనసాగించారని ఆక్షేపించారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు డీఎంఈ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు బాధ్యులుగా పేర్కొంటూ జైలుశిక్ష, జరిమానా విధించారు.

ఇదీ చదవండి: HIGH COURT: కోర్టు ధిక్కరణ కింద... ఆ తహసీల్దార్​కు ఆరు నెలల జైలు శిక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.