తెలంగాణలో జులై 18న హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది. జిల్లాల అఫిలియేషన్‌పై ఆరోజు హెచ్‌సీఏ నిర్ణయం తీసుకోనుంది. హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు జాన్ మనోజ్ ఆధ్వర్యంలో సమావేశం జరగనుండగా.. 6 జిల్లాలకు అజారుద్దీన్ ఇచ్చిన అఫిలియేషన్‌పై చర్చిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యాక తొలి భేటీ జరగనుంది.
అజారుద్దీన్‌ను తప్పించిన తర్వాత లోధా కమిటీ సిఫార్సుల మేరకు అపెక్స్ కౌన్సిల్.. జాన్ మనోజ్‌ను నియమించింది. కొంతకాలం నుంచి అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, అజారుద్దీన్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. హెచ్‌సీఏ ప్రయోజనాల్ని అజారుద్దీన్ ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అధ్యక్ష పదవితో పాటు హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేసింది. తనను తప్పించడం నిబంధనలకు విరుద్ధమని ఇప్పటికే అజారుద్దీన్ స్పష్టం చేయగా.. హెచ్‌సీఏ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది.
ఇదీ చదవండి: