ఓ సమావేశంలో వైకాపా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరకు చెందిన తెరాసకు చెందిన మల్లాది వాసుపై ఏపీలోని వివిధ రాణాల్లో నమోదు చేసిన కేసుల్లో సీఆర్పీసీ 41ఏ నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథాయ్ సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
వైకాపా నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కారణంతో వాసుపై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీలోని ఒంగోలు, సత్తెనపల్లి, దాచేపల్లి తదితర పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ఒకే ఘటనకు సంబంధించి బహుళ ఎఫ్ఎస్ఐఆర్లు నమోదు సరికాదన్నారు. సుప్రీంకోర్టు ఈ వ్యవహారమై ఇప్పటికే స్పష్టత ఇచ్చిందన్నారు. ఒక్క కేసుగానే భావించాలన్నారు.